వేద న్యూస్, ఎంజీఎం:
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం దవాఖానలో సేవలు అంతంత మాత్రంగా అందుతున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఎక్స్‌రే మిషన్ గదికి ఆదివారం సాయంత్రం తాళం వేశారు.
దీంతో క్షతగాత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారి ఎముకల స్థితిని తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీయాల్సి ఉంటుంది. అయితే, అత్యవసర విభాగంలో అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.
కావున ఎంజీఎం ఉన్నత అధికారులు స్పందించి వెంటనే ఎక్స్‌రే గది తాళం ఓపెన్ చేసి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.

