వేద న్యూస్, వరంగల్ టౌన్ : 

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ పోర్ట్ రోడ్ ASM కాలేజ్ ఎదురుగా RM జిమ్ సెంటర్ లో యోగ గురువు తో మహ్మద్ మునిర్ పాషా ప్రత్యేకంగా యోగా క్లాసెస్ ఏర్పాటు చేయించడం జరిగింది.

ఈ సందర్భంగా కోచ్ చారి మాట్లాడుతూ యోగా ప్రతి ఒకరు కచ్చితంగా చేయాలని యోగా చేయడం వల్ల మనకు మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది ప్రశాంతం అయిన జీవితం లభిస్తుందన్నారు. ఆరోగ్యంగా యవనంగా ఉంటారు రోగాల బారిన పడకుండా ఉంటారు అని చారి తెలిపారు. అలాగే ఇప్పుడు వున్న పొల్యూషన్ కారణంగా రానున్న రోజులో ఎక్కువ కాలం బతకడం కష్టం అవుతుంది అలాగే సమయానికి వానలు పాడాలి అన్న ఎండ తీవ్రత తగ్గాలి అంటే యోగ దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటి కి ఒక చెట్టు పెట్టాలి భవిష్యత్ తరాలను కాపాడుకోవాలి అని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిమ్ ఓనర్ మునీర్,మోహన్,రవితేజ,వంశీ,చారి,శివ,ప్రసాద్,జాకీర్,నజీర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *