Oplus_16908288

 

వేద న్యూస్, బ్యూరో:

రోడ్డు మరమ్మతులను అధికారులు పట్టించుకోవడం లేదంటే యువకుడు వినూత్న నిరసన తెలిపాడు. నడిరోడ్డుపై గుంతలో కూర్చొని ప్రొటెస్ట్ చేశాడు.

అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కరీంనగర్‌లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అధ్వానంగా మారిపోయింది.

కరీంనగర్ నుండి నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గాని, పొలిటికల్ లీడర్స్ గాని ఎవరూ పట్టించుకోవడం లేదని కరీంనగర్‌కు చెందిన కోట శ్యామ్ కుమార్ నిరసన కార్యక్రమం చేపట్టారు.

రోడ్డుపై వాహనం నడపాలంటేనే భయం వేస్తుందన్నారు. మరోవైపు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని పోలీసులు ఫైన్‌ల రూపంలో జరిమానాలు కట్టిస్తున్నారన్నారు. కానీ రోడ్లు మాత్రం బాగు చేయడం లేదని పేర్కొన్నారు.