• ప్రజల తరఫున ప్రశ్నించే గళంగా యువ నాయకుడు జబొరె మహేశ్

వేద న్యూస్, ఆసిఫాబాద్:

యువత రాజకీయాల్లో రాణించాలంటే వారికి ప్రజల మద్దతు అత్యంత కీలకం. అందులో ప్రజా  సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండి.. పరిష్కారానికి పని చేసే నాయకులకు సపోర్టు చేయడం అత్యంత ఆవశ్యకం. కాగా, ఆ కోవకు చెందిన యువనాయకుడిగా ఉన్న జబొరె మహేశ్ కు జనం మద్దతుగా నిలిచారు.  

జైత్ పూర్ గ్రామ పంచాయతీలోని 4 వ వార్డు సభ్యుడిగా గ్రామానికి చెందిన యువ నాయకుడు జబొరె మహేష్ బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న యువకుడైన  మహేశ్ ను వార్డు సభ్యుడిగా గెలిపించాలని భావించాలని ప్రజలు ఆయన్ను ఏకగ్రీవం చేశారు. 

గ్రామంలోని పలు సమస్యలను ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేసిన అనుభవం, నేర్పరితనం యువకుడు మహేశ్ కు ఉన్నాయని పలువురు చెబుతున్నారు. నిత్యం సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌కు వెళ్లి ఉన్నతాధికారులతో మాట్లాడగలిగే చొరవ, అనుభవం ఉన్న మహేశ్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే.. ఆయనకు అందరి మద్దతు అవసరం అని అంటున్నారు.