వేద న్యూస్, వరంగల్:

నెక్కొండ మండలం గొట్లకొండ గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల క్రికెట్ క్రీడోత్సవాలు నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి శుక్రవారం టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడల్లో గెలిచిన విజేతకు మొదటి బహుమతిని రూ.10 వేలతో పాటు ఫీల్డ్ బహూకరించారు. రెండో బహుమతిని నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్ రెడ్డి , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ రూ.5 వేలర తో పాటు బహుమతి అందజేశారు.

కార్యక్రమంలో నెక్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్ ,మండల కాంగ్రెస్ నాయకులు కుసుమ చెన్నకేశవులు, చల్ల శ్రీపాల్ రెడ్డి , మార్కెట్ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి కున్సోత్ , నైజాం పోలిశెట్టి భాను ప్రకాష్ , ఎడ్ల వెంకన్న, కున్సోత్ శంకర్, గొట్లకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్య జనార్ధన్, మాలో శివలాల్ , సంతు సేవాలాల్ మహారాజ్ యూత్ అధ్యక్షుడు గుగులోత్ వెంకన్న, ఉపాధ్యక్షుడు దారం సోప్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.