వేద న్యూస్, రాంపూర్ :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులో గల అనాధ పిల్లల అశ్రములో (కరుణలయం సెంటర్)లో స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వస్కుల శ్రీను హాజరై అరటి పండ్ల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ కార్యకర్త స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సండ్ర సందీప్, సినియర్ నాయకులు మునిగాల భిక్షపతీ, సండ్ర భిక్షపతీ, సండ్ర కుమార్, టీ సారయ్య, బొజ్జశ్రీను, నమ్మిండ్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.