• రాష్ట్రంలోని 40 స్థానాల్లో పోటీ
  • అందరూ విద్యావంతులే..మార్పు కోసం ప్రయత్నం
  • విద్యార్థుల రాజకీయ పార్టీ బ్యాట్ గుర్తుకు ఓటేయాలని ప్రచారం

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:

దేశరాజకీయాల్లో గుణాత్మక, విప్లవాత్మక మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఓ యువకుడు సరికొత్త ఆలోచనతో ముందడగు వేశారు. మార్పు లక్ష్యంగా రాజకీయాల్లో సరికొత్త విధానాలను, ప్రభుత్వ పనితీరులో పారదర్శకతను తీసుకురావాలనే ఉద్దేశంతో విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్పీ)ని స్థాపించారు. ఆ యువకుడు, విద్యావంతుడు ఖమ్మంకు చెందిన యెచ్చు సునీల్. విద్యార్థుల రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. సునీల్ విద్యార్థిగా ఉన్న నాటి నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. ఆ‘నాడు’ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో నాయకుడిగా కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ యూనియన్(టీపీఎస్‌యూ) ను స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమంలో అగ్రభాగాన నిలిపారు. ఈ క్రమంలోనే ఉన్నత చదువులు ఎంటెక్ కూడా పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత నాయకులు ఈటల రాజేందర్.. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవి ఇస్తామని సునీల్ కు నామినేటెడ్ పోస్ట్‌ను ఆఫర్ ఇచ్చారు. కాగా, యెచ్చు సునీల్ తిరస్కరించారు. ప్రత్యేక తెలంగాణలో సైతం ప్రజలు కోరుకుంటున్న మార్పు రాదని ముందుగానే గ్రహించి..ప్రజల కోసం..పవర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అనే సంస్థను స్థాపించి ప్రజాసేవలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎల్ ఎల్ బీ పూర్తి చేశారు. హై కోర్టు అడ్వకేట్ గా పని చేస్తున్నారు.

భ్రష్టుపట్టిన వ్యవస్థ మారాలంటే అది రాజకీయాలతోనే సాధ్యం భావించి..రాజకీయ పార్టీ స్థాపనకు సునీల్ పూనుకున్నారు. 2018లో పార్టీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోగా, 2019 ఫిబ్రవరిలో ‘విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్పీ)’రిజిస్ట్రేషన్ అయింది. కరోనా కష్టకాలంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయిన పార్టీ వ్యవస్థాపకులు సునీల్..2021 ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో 10 చోట్ల పోటీ చేశారు. అలా పార్టీని ఎన్నికల బరిలో తొలిసారి తీసుకెళ్లిన యెచ్చు.. ఈ సారి అసెంబ్లీ బరిలో దిగారు.

2022 జూన్ నుంచి వీఆర్పీ క్రియాశీలకంగా పనులు ప్రారంభించారు. 2 లక్షలా 60 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని వీఆర్పీ తొలుత డిమాండ్ చేసింది. ప్రజలు, నిరుద్యోగుల కోసం ప్రజా క్షేమమే ధ్యేయంగా విద్యార్థుల రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా వీఆర్పీ ముందుకెళ్తోంది. ఉచిత విద్య, వైద్యం, అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం వంటి విషయాలను ఎజెండాగా ప్రజల్లో చర్చకు తీసుకొచ్చారు. చూడాలి మరి.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థుల రాజకీయ పార్టీ(బ్యాట్ గుర్తు) ఏ మేరకు ప్రభావం చూపనుందో..

 

35 ఏండ్ల లోపు వాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు: వీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షులు,

ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి యెచ్చు సునీల్

‘బీఆర్ఎస్ ను బొంద పెడుదాం..కాంగ్రెస్ ను ఖతం చేద్దాం’ అనే నినాదంను ప్రజల్లోకి తీసుకెళ్లడమే విద్యార్థుల రాజకీయ పార్టీ లక్ష్యం. యువత రాజకీయాల్లోకి రావాలని మాటల్లో చెప్పడం కంటే చేతల్లో చూపించాలనే ఉద్దేశంతో విద్యార్థులనే ముఖ్యంగా 35 ఏండ్ల లోపు వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం. భవిష్యత్తులో విద్యార్థుల రాజకీయ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ సారి తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాం. మార్పు కోసం ప్రజలు వీఆర్పీ వైపు చూడాలని కోరుతున్నా. బ్యాట్ గుర్తుకు ఓటేసి విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నా.

 

తస్మాత్ జాగ్రత్త మళ్లీ ఇంకోసారి మోసపోకండి: పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి యువరాజు సంగెకారి
పరకాల నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. విద్యావంతుడినైన నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్పీ) తరఫున ఎన్నికల బరిలో ఉన్నా. విద్యార్థుల రాజకీయ పార్టీ ముఖ్యంగా నిరుద్యోగుల కోసమే పురుడు పోసుకుంది. నిరుద్యోగులుగా యువత మిగలకూడదనే ఉద్దేశంతోనే ఈ పార్టీ స్థాపించారు. ఈ పార్టీ లో నిరుద్యోగులే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నారు. ఈ 9 ఏండ్ల కాలంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. అన్ని వర్గాలను మోసం చేశాడు. విద్యార్థులకు ఉద్యోగాలు అని, నిరుద్యోగులకి భృతి ఇస్తా అని, దళిత ముఖ్యమంత్రి అని, మూడెకరాల భూమి అని.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. ఇప్పటి వరికి ఒక్కొక్క నిరుద్యోగికి కేసీఆర్ 1,80,960/- రూపాయలు బాకీ ఉన్నాడు. దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, రైతులకు ఉచిత ఎరువులు….ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఆచరణలో అమలు చేయలేదు. కావున దయచేసి ఈ సారి మా పార్టీకి మద్దతు ఇవ్వండి. వీఆర్పీ ఎన్నికల గుర్తు బ్యాట్ కు ఓటు వేసి కేసీఆర్‌కు నిరుద్యోగుల బలం ఏందో చూపించాలని కోరుతున్నా.

 

ప్రజలారా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పండి: హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి సందీప్ కొంగంటి ‌

బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మార్పు కోసం ఈ సారి వీఆర్పీ(విద్యార్థుల రాజకీయ పార్టీ) వైపు చూడండి. గత తొమ్మిదేండ్లుగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులను ఇబ్బందులు పెడుతోంది. ప్రతీ విద్యార్థి మేలుకొని ఆలోచన చేయాలి. తొమ్మిదేళ్లుగా విద్యార్థి లోకం కష్టపడుతూనే ఉంది. ప్రతీ ఎగ్జామ్ నోటిఫికేషన్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేస్తూనే ఉంది. తెలంగాణ కోసం ఎక్కువ కష్టపడ్డది విద్యార్థులే..కాగా, తెలంగాణ వచ్చాక కూడా ఎక్కువ నష్టపోయింది విద్యార్థులేనని గుర్తించాలి. ప్రతీ విద్యార్థి రాష్ట్రంలో, హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్యార్థుల కోసం పోరాడే వీఆర్పీకి మద్దతు తెలపాలి. విద్యార్థులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. పిల్లల బంగారు భవిష్యత్ కోసం ప్రజానీకం వీఆర్పీ వైపు చూడాలి. క్రికెట్ బ్యాట్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నా.

 

పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలివే..

1.ఆలేరు-బుగ్గ శ్రీకాంత్
2.ఆసిఫాబాద్-ఎన్ తిరుపతి
3. భద్రాచలం- ఎం మిత్ర
4. చొప్పదండి- అజయ్ లక్కం
5.దేవరకొండ- కే బాబురామ్
6. దేవరకద్ర-జి కథలయ్య
7.గద్వాల్- ఎం వెంకట్ రెడ్డి
8.గజ్వేల్- నాగరాజు ఎన్
9. స్టేషన్ ఘన్ పూర్- సీహెచ్ రజనీకాంత్
10.హుస్నాబాద్- కొంగంటి సందీప్
11.ఇబ్రహీంపట్నం- సందీప్ రెడ్డి
12. జగత్యాల- నందూలాల్
13.కల్వకుర్తి- వి వినయ్
14.కార్వాన్- అనిల్ జి
15. ఖమ్మం- యెచ్చు సునీల్
16.ఎల్బీనగర్ – అంకిత్ కె
17.మహేశ్వరం- మల్లేశ్ పి
18.మలక్ పేట్- అహ్మద్ షేక్
19. మంచిర్యాల- సురేశ్ జి
20.మిర్యాలగూడ- మనోజ్ కుమార్
21.మునుగోడు- సురేశ్ ఎన్
22. నాగర్ కర్నూల్- సి సురేందర్ రెడ్డి
23. పాలకుర్తి- రాజ్ కుమార్ ఎన్
24.పరకాల- యువరాజు సంగెకారి
25.పినపాక- జి రమేశ్
26.కుత్బుల్లాపూర్- సాత్విక రెడ్డి
27.రాజేంద్రనగర్ -డి గోపాల్
28.రామగుండం- మనోహర్ టి
29.సంగారెడ్డి- శరత్ కుమార్ ఆర్
30.సికింద్రాబాద్- నవీన్ బాబు పి
31.షాద్ నగర్ – వినయ్ గౌడ్ ఎస్
32.సిరిసిల్ల-శ్రీనివాస్ ఎల్
33.ఉప్పల్ – సురేందర్ రెడ్డి
34.వర్ధన్నపేట్- శ్రవణ్ ఎం
35.వరంగల్ తూర్పు- ఇజ్జగిరి కమలాకర్
36.వైరా- బాను సింగ్ జి
37.యాకత్ పుర- అనిల్
38.ఇల్లందు- ఎల్ ప్రసాద్
39.ఎల్లారెడ్డి- శ్రినివాస్
40.జహీరాబాద్-బి సిద్ధార్థ్