చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సత్యం
వికలాంగురాలికి రూ.50 వేల సాయం
వేద న్యూస్, చొప్పదండి/గంగాధర:
రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. వికలాంగులకు ఆర్థికంగా భరోసా కల్పించడానికి ప్రభుత్వం ఆర్థిక పునరావాస స్కీమును ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన మామిడిపల్లి విజయకు ఆర్థిక పునరావాస భరోసా పథకం క్రింద 100% సబ్సిడీతో రూ. 50 వేల ఆర్థిక సహాయం మంజూరు అయింది. బుధవారం గంగాధర మండలం మధురానగర్ లోని ప్రజా కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లబ్ధిదారురాలికి పరిహారం చెక్కును అందజేశారు. 100% సబ్సిడీపై ఆర్థిక సహాయాన్ని మంజూరి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకోసం సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు విజయ కృతజ్ఞతలు తెలిపారు.