* పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు..
* భక్తుల జై జై నినాదాలతో మార్మోగిన ఏడుపాయల పురవీధులు
వేద న్యూస్ పాపన్నపేట
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వన దుర్గ మాత ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం అమ్మవారి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రంగురంగుల పూలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ పూజారులు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఆలయ పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై బోలో దుర్గామాతకు జై అంటూ చేసిన నినాదాలతో ఏడుపాయల పరిసరాలు మార్మోగాయి. అమ్మవారి పల్లకి సేవను దర్శించుకుని భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మఠం వీరేశం, సిబ్బంది సూర్యశ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, పల్లె సాయిబాబా, నరేష్, మహేష్, యాదగిరి, బలరాంతో పాటు ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు.
