- ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా డాక్టర్ సుధాకర్
వేద న్యూస్, జమ్మికుంట:
ప్రముఖ వైద్యుడు, ఐఎంఏ హుజురాబాద్ జమ్మికుంట శాఖ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ అంకం సుధాకర్ కు ఐఎంఏ రాష్ట్ర పదవి వరించింది.
ఐఎంఏ హుజురాబాద్ జమ్మికుంట శాఖ అధ్యక్షునిగా మన్ననలు అందుకున్న తర్వాత రాష్ట్ర ఐఎంఏ ప్రతినిధుల అభ్యర్థన మేరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పోటీలో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ.. ఈ పదవితో తన బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఐఎంఏ కార్యకలాపాలను మరింత మెరుగుపరచడమే కాకుండా రాష్ట్రకార్యవర్గంతో అనుసంధానించడానికి ఒక వారధిగా పనిచేసే అవకాశం తనకు కలిగిందని వెల్లడించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, సహచర డాక్టర్లు.. సుధాకర్ ను అభినందించారు. తన విజయానికి సహకరించిన ఐఎంఏ ప్రతినిధులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఐఎంఏ శాఖ అధ్యక్షుడిగా గతంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి డాక్టర్ సుధాకర్ చక్కటి పేరు గడించారు. వృత్తినే దైవంగా భావించి 24/7 అందుబాటులో ఉన్న జమ్మికుంట పట్టణ, మండల, పరిసర ప్రాంత ప్రజలకు నిత్యం సేవలందించే డాక్టర్ అంకం సుధాకర్ కు ఐ ఎం ఏ రాష్ట్ర పదవి రావడం పట్ల స్థానికులు, పలువురు వర్షం వ్యక్తం చేశారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హుజురాబాద్ జమ్మికుంట శాఖ అధ్యక్షుడిగా చక్కటి సేవలు అందించిన సుధాకర్.. రాష్ట్ర వారు కార్యవర్గ సభ్యునిగా కూడా మరింత విస్తృతంగా సేవలందిస్తారని పలువురు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

