వేద న్యూస్, వరంగల్: 

తెలంగాణ పోలీస్ పోలీస్ డ్యూటీ మీట్స్ సందర్భంగా రెండో రోజు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  సాంస్కృతిక కార్యక్రమాల్లో వరంగల్ పోలీస్ కమిషనర్ సంగ్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. తన సహచర అధికారులతో కలిసి చిందులేయడంతో అక్కడ ఉన్న సిబ్బంది సైతం ఉత్సాహంగా స్టెప్పులు వేశారు.

‘మను కాలా చాష్మా’ అనే సినీ (హిందీ) పాటకు ఉత్సాహంగా సీపీ డ్యాన్స్ చేయగా, తోటి పోలీస్ అధికారులు సైతం డ్యాన్స్ చేశారు. సీపీ తన డ్యాన్స్ తో తోటి పోలీస్ ఆఫీసర్లలో ఫుల్ జోష్ నింపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.