- సర్పంచ్ ఎన్నికలలో మారిన ట్రెండు..
- ఓడిన అభ్యర్థులు తమ డబ్బులు తమకే కావాలంటూ.. జనం వద్దకు వెళుతున్న సందర్భం
- మంగళ హారతి పట్టుకొని మరీ వెళుతున్న వైనం..?!
వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి:
స్థానిక సర్పంచు ఎన్నికలలో సిత్రాలు, విచిత్రాలు తెరమీదికి వస్తున్నాయి. మద్యం ఏరులై పారుతుండడమే కాదు.. నోట్ల కట్టలు ఓటర్లకు పెద్ద ఎత్తున పంచి పెడుతున్నారు అభ్యర్థులు. ఈ క్రమంలో ఓటమి ఎదురైతే తిరిగి తమ డబ్బులు తమకి ఇచ్చి వేయాలంటూఅడుగుతుండటం సంచలనంగా మారుతున్న ది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలం లోని బాలాజీ అనుకోడా గ్రామం లో ఓడిన ఓ అభ్యర్థి.. ” మా డబ్బులు మాకు ఇవ్వండి…మీరు మాకు ఓటు వేయ నట్లయితే” అని ఇంటి ఇంటికి వెళ్ళి డబ్బులు అడుగుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.
