•  ఆవిర్భావ దినోత్సవమును మరిచిన అధికార పార్టీ నేతలు
  • అధికారం లేనప్పుడు ఎగిరిన కాంగ్రెస్ జెండా
  • నాడు ఎగిరిన పార్టీ జెండా. నేడు ఏది? 

వేద న్యూస్, చొప్పదండి :

 చొప్పదండి పట్టణ పరిధిలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ జెండా గద్దె వద్ద,  పార్టీ కార్యాలయంలో  పార్టీ జెండా ఎగరలేదు.

పట్టణంలో పార్టీకి సంబంధించిన నాయకులు పలుమంది ఉన్న, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా జెండాను ఎగరవేత ను విస్మరించారు.

నియోజకవర్గ కేంద్రంగా ఉన్న చొప్పదండి పట్టణంలో పార్టీ జెండా ఎగరకపోవడం గమనార్హమ్. పార్టీ ఆవిర్భావం జరిగి ఈరోజుకి 141 సంవత్సరాలు గడిచిన ఆ జెండా కిందనే ఉంటూ మొట్టమొదటిసారిగా చొప్పదండి పట్టణంలో పార్టీ జెండా ఎగరకపోవడం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ లో పట్టింపు లేని నాయకులు ఉన్నారా అని ప్రజల్లో సందేహం కలుగుతున్న ది. 

అధికారం లేనప్పుడు ఎగిరిన పార్టీ జెండా నేడు జెండా ను ఎగురవేసే నాయకులు లేరా? మరి ఏమైనా అంతర్గతంగా వేరే కారణాలు ఉండొచ్చని ప్రజలు భావిస్తున్నారు.