వేద న్యూస్, వరంగల్ టౌన్ :
వరంగల్,దేశాయి పేట Ckm కళాశాల గ్రౌండ్ లో నిర్వహించిన మెగా వైద్య శిబిరం విజయవంతమైందని నిర్వాహకులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్, మన ముచ్చట్లు వాట్సాప్ గ్రూప్ బాద్యులు,గోకె వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ కొలంబో వైద్య కళాశాల (మెడికేర్ హాస్పిటల్ ) కార్డియాలజీ విభాగం అధిపతి ..ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ అత్తే భగీరధ్ , ఇంచార్జ్ డాక్టర్ చందన, వారి వైద్య బృందం ఆధ్వర్యంలో… సుమారు 100 మంది రోగులకు ఉచితంగా బి.పి,ఈ.సీ.జీ పరీక్షలు నిర్వహించి, ఉచిత కార్డియాలజీ కన్సల్టేషన్ తో పాటు విలువైన వైద్య సలహాలు, సూచనలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ భాద్యులు గోకె వెంకటేష్, మన ముచ్చట్లు గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెరుమాండ్ల మధుసూదన్, నేతృత్వం వహించగా కార్యక్రమం లో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ భాద్యులు చింతం సారంగపాణి , ఎంబడి మల్లయ్య, కరుణాకర్, సుధాకర్ మరియు బాధ్యులు పాల్గొన్నారు.
