వేదన్యూస్ వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 కొత్త తహశీల్దార్ కార్యాలయాల నిర్మాణాలు జరగనున్నాయి. ఒక్కో కార్యాలయంకు 2 కోట్ల 25 లక్షలతో నిర్మించనున్నారు. ఈమేరకు 15 భవనాలకు 33 కోట్ల 75 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. HNK(D)లో ఆత్మకూరు, శాయంపేట, కాజీపేట, జనగామ (D)లోని ఘనపూర్, చెల్పూర్, తరిగొప్పుల, WGL(D)లో WGL, గీసుగొండ, పర్వతగిరి, నర్సంపేట, MHBD(D)లో దంతాలపల్లి, ఇనుగుర్తి, సీరోలు, ములుగు(D)లో ములుగు, మల్లంపల్లిలో నిర్మించనున్నారు.
