వేదన్యూస్ హనుమకొండ జిల్లా

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన స్వానిధి మహోత్సవ్–2026 కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్నీ ప్రారంభించారు.
స్వనిధి మహోత్సవ కార్యక్రమంలో వరంగల్ నగరానికి చెందిన ఎండి పాషా కి బెస్ట్ స్ట్రీట్ వెండర్ అవార్డును హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ చేతుల మీదుగా అందుకున్నారు. అనంతరం కలెక్టర్ MD పాషా ను శాలువతో సత్కరించి అభినందించారు.

వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి అవసరమైన ఆర్థిక, సాంకేతిక, డిజిటల్ సేవలను చేరువ చేయడం ద్వారా స్వయం ఉపాధిని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

అనంతరం రుణాలు అందించిన బ్యాంకర్లు, వీధి వ్యాపారులకు శాలువలతో సత్కరించి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్, ఉప కమిషనర్ సమ్మయ్య, ఎల్ డిఎం మహేందర్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నవీన్ కుమార్, డి ఎం సి రజిత రాణి, టి ఎం సి లు రమేష్ సంబంధిత అధికారులు, వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *