వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) నూతన కమిషనర్‌గా టి. వెంకన్న సోమవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
