• కావల్ టైగర్ రిజర్వ్‌లో అవగాహనకు గుర్తింపు – ప్రశంసా పత్రం, నగదు బహుమతి ప్రదానం

వేద న్యూస్, వరంగల్:
గ్లోబల్ టైగర్ డే–2026 సందర్భంగా ఒరుగల్లూ వైల్డ్‌లైఫ్ సొసైటీ (OWLS) సంస్థకు ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతి అందజేయడం సంస్థకు గర్వకారణంగా నిలిచింది. తెలంగాణలోని కావల్ టైగర్ రిజర్వ్‌లో, ముఖ్యంగా మంచిర్యాల జిల్లా పరిధిలో వన్యప్రాణి సంరక్షణపై అవగాహన కల్పించడంలో సంస్థ చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవం దక్కింది.

ఈ సందర్భంగా OWLS సంస్థ తెలంగాణ ప్రభుత్వం మరియు అటవీ శాఖకు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే  మంత్రి కొండా సురేఖ  (పర్యావరణ, అటవీ మరియు ఎండోవ్మెంట్స్ శాఖ మంత్రి), పీసీసీఎఫ్ & హోఫ్  వినయ్ కుమార్, IFS, సీసీఎఫ్  శాంతారాం, IFS, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్, IFS  తమ సేవలను గుర్తించి హైదరాబాద్‌లోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ఈ పురస్కారాన్ని అందజేయడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.

తమ ప్రయాణంలో తోడ్పడిన మార్గదర్శకులు, మద్దతుదారులు, సహచర స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా మిత్రులు, ప్రకృతి ప్రేమికులందరికీ సంస్థ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

OWLS తరఫున అధ్యక్షులు ఐ. నాగేశ్వరరావు మరియు జాయింట్ సెక్రటరీ, ప్రముఖ పర్యావరణవేత్త పిట్టల రవిబాబు కార్యక్రమంలో పాల్గొని అవార్డును స్వీకరించారు. ఈ గుర్తింపు తమ బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో వన్యప్రాణి సంరక్షణ కోసం మరింత కృషి చేస్తామని సంస్థ ప్రతిజ్ఞ చేసింది.

“హ్యాపీ ఇంటర్నేషనల్ టైగర్ డే”
“సేవ్ ది టైగర్ – సేవ్ వైల్డ్‌లైఫ్ – సేవ్ నేచర్”

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *