వేదన్యూస్ తెలంగాణ :

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు ఎలక్ట్రిక్ ఆటో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ‘ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ’తో ఇంటి నుంచి బస్ స్టాప్ వరకు, బస్ స్టాప్ నుంచి గమ్యస్థానం వరకు సులభంగా చేరుకునేలా ఈ సేవలు ఉపయోగపడతాయి. బస్సు టికెట్తో పాటు ఎలక్ట్రిక్ ఆటో టికెట్ను కూడా ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. మొదటి దశలో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రంలోని ఇతర నగరాలకు విస్తరించనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *