•  వాటి స్వైర విహారంతో వరి నారు చెల్లాచెదురు.. ఓ రైతుకు నష్టం
  •  కోరపల్లి ప్రభుత్వ పశు వైద్యశాలలో పందుల నివాసమేల?
  •  జనం ఆగ్రహం

 

వేద న్యూస్ , జమ్మికుంట:

 

జమ్మికుంట మండల పరిధిలోని కోరపల్లి గ్రామ “గ్రామీణ పశు వైద్యశాల” పందులకు అడ్డాగా మారింది. గ్రామం లోని పశువులకు వైద్యం , పాడి పశువుల రక్షణ నిమిత్తం ప్రభుత్వం గ్రామీణ పశు వైద్యశాల పేరిట ఆఫీసును 1973లో నిర్మించింది.

 

అప్పట్లో దానిని జిల్లా పశు వైద్య శాఖ అధికారి ప్రారంభించారు. పాడి సస్యరక్షణ లక్ష్యంగా ఈ పశు వైద్యశాలలో సేవలందించాలని భావించారు. కానీ, కొందరు దానిని పందులకు అడ్డాగా మార్చి.. ఏకంగా ఆఫీసు లోపల వరిగడ్డినీ పెట్టి.. తమ సొంత పాకలాగా మార్చుకొని పందులను అక్కడే నివాసంగా మార్చడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆఫీసు లోపల పందులను పెట్టి బయట తాళాలు సైతం వేస్తూ ఉండటం గమనార్హం. ముఖ్యంగా రైతులు తమ పశువులు ఇతర వైద్యం నిమిత్తం పశు వైద్యశాలకు వస్తే.. ఆ విభాగ వైద్య శాఖ వారు డాక్టర్లు, సిబ్బంది అక్కడ సేవలందించేందుకు వీలుగా ఉంటుంది. కొందరి నిర్వాకంతో ప్రస్తుతం కోరపల్లి గ్రామీణ పశు వైద్యశాల ఓ రకంగా పందుల నివాస అడ్డాగా మారడం పట్ల తీవ్రమైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సదరు వ్యక్తుల తీరు సరికాదని, పందులను ప్రభుత్వ గ్రామీణ పశు వైద్యశాల ఆవరణలో పెట్టడం సమంజసం కాదని, వారిపైన తగు చర్యలు ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పందుల స్పైర విహారంతో తాజాగా ఓ రైతు తన పొలం వద్ద వేసిన వరినారు చెల్లాచెదురు అయింది. సదరు రైతుకు నష్టం చేకూరడమే కాకుండా.. పందుల విచ్చలవిడి స్వైర విహారంతో కొంత ఇబ్బంది జరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.

ప్రభుత్వ భవనంగా ఉన్న పశువైద్యశాలను తమ పాకలాగా మార్చుకోవడం అంటే తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడమేనని, సదరు వ్యక్తులపై గ్రామ పాలకవర్గం తగు రీతిలో చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *