వేద న్యూస్, చిల్పూర్: రాబోయే గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని చిల్పూర్ ఎస్సై సిరిపురం నవీన్ కుమార్ కోరారు. ల అనుమతి ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. మండపాల నిర్వాహకులు పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని, ఆన్లైన్లోనే తమ మండపం వివరాలను నమోదు చేసి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఆన్లైన్ పర్మిషన్ లింక్:
“తెలంగాణ పోలీస్ ఆన్లైన్ పోర్టల్” https://policeportal.tspolice.gov.in/index.htm అనుమతి లేకుండా ఎలాంటి వినాయక మండపాన్ని ఏర్పాటు చేయరాదని ఎస్సై సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులో అడిగిన వివరాలను సరిగ్గా నమోదు చేయాలని, ఉత్సవాలను శాంతియుతంగా, పోలీస్ శాఖ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు మండపాల నిర్వాహకులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్సై సిరిపురం నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
