గొప్ప మనసు చాటుకున్న కౌన్సిలర్ ఫెరోజ్

  • వార్డులో నిరుపేద మహిళ దహన సంస్కారాలు జరిపించిన ఫెరోజ్

వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 7వ వార్డులో నివసించే వీర్ల సుశీల 55 అని అనబడే మహిళ అనారోగ్యం కారణంతో మృతి చెందింది.కటిక పేదరికం కావడంతో పాటు ఇద్దరు కూతుర్లు కూడా నిస్సహాయ స్థితిలో ఉండటం వల్ల స్థానిక కౌన్సిలర్ ఫిరోజ్ కి సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకున్న ఫిరోజ్ తన మిత్రులతో కలిసి శవాన్ని ఇంటి నుండి కొత్తపల్లి స్మశాన వాటికకు తరలించి అక్కడ దహన సంస్కారాలకు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇంటి దగ్గర చుట్టూ పక్కల వారు కూడా ఎవరు దగ్గరికి రాకపోవడంతో వారి కూతుళ్ళ దగ్గర దహన సంస్కారాలకు సైతం డబ్బులు లేకపోవడంతో అన్ని తానై చూసుకున్న కౌన్సిలర్ ఫెరోజ్ ..  ఫిరోజ్ మాట్లాడుతూ… కటిక పేదరికంలో ఉన్న వారు ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నారు.ప్రతి మనిషి యొక్క ఆఖరి మజిలీ అయినా మంచిగా జరగాలని కోరారు

.సమాజంలో మనమందరం బ్రతుకుతున్నాం అందరు బాగుండాలి అని కోరుకోవాలి. డబ్బు శాశ్వతం కాదు మనం చేసే మంచి పనులే మనల్ని చనిపోయాక కూడా కాపాడుతాయి అంటూ సమాజానికి తెలియపరిచారు. మృతురాలి కుటుంబసభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలియజేసారు. 

కార్యంలో  సహాయ సహకారాలు అందించిన ముస్లిం మిత్రులకు మరియు మున్సిపాలిటీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *