వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి గురువారం ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లోపలి, బయటి పరిసరాలను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌కు పలు సూచనలు చేశారు. మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లుగానే పోలీస్ స్టేషన్ పరిసరాలను కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలించాలని ఆదేశించారు.ఈ తనిఖీలో హన్మకొండ ఏసీపీ ఇన్‌చార్జి నర్సింగరావుతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
