కారు బైక్ డి వ్యక్తి మృతి
వేద న్యూస్, పాపన్నపేట
కారు బైక్ డికొన్న సంఘటన లో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని యూసుఫ్ పేట శివారులోని గ్రామీణ బ్యాంక్ సమీపన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటింబికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కుర్తివాడ గ్రామానికి చెందిన సార యేసు (45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం
మెదక్ పట్టణనం లోని తమ బంధువుల వద్దకు వెళ్ళి వస్తానని కుటింబికులకు తెలియజేసి తన ద్విచక్ర వాహనం పై వెళ్ళి తిరిగి స్వగ్రామమైన కుర్తివాడ కు వస్తున్న క్రమంలో యూసుఫ్ పేట గ్రామ సమీపంలో బొడ్మట్ పల్లి వైపు నుండి మెదక్ వైపు వెళుతున్న కారు అతివేగంగా డి కొనడం తో కిందపడి అక్కడి కక్కడే మృతి చెందగా. స్థానికులు వెంటనే ప్రమాదాన్ని గుర్తించి వెంటనే పాపన్నపేట పోలీసులకు, కుటింబికులకు సమాచారం చేరావేయడం తో పోలీసులు, కుటింబికులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే యేసు మృతి చెందడం తో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రి తరలించి మృతుడి భార్య సుమతి పిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాగా మృతుడికి భార్య సుమతి తో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు
