*విశ్వక్‌ నందన్‌కు పద్మాదేవేందర్‌రెడ్డి ఆశీస్సులు*

*ఘనంగా మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ బుర్ర కిష్టగౌడ్‌ మనవడు  తొలి జన్మదిన వేడుకలు*

వేద న్యూస్, పాపన్నపేట

పాపన్నపేట మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ బుర్ర కిష్టగౌడ్‌ మనవడు, శ్రీధర్‌ కుమారుడు విశ్వక్‌ నందన్‌ తొలి జన్మదిన వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. మండలంలోని గాంధారిపల్లి రోడ్డులో గల ఎస్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు రాష్ట్ర మాజీ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జిల్లా నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, స్థానిక మండల నాయకులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఆమె, చిన్నారి విశ్వక్‌ నందన్‌తో కేక్‌ కట్‌ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
ఈ వేడుకల్లో పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్ సురేష్, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్‌ బాలాగౌడ్‌, మెదక్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, మాజీ సర్పంచులు గురుమూర్తిగౌడ్‌, లింగారెడ్డి, బద్రి మల్లేశం, మాజీ ఎంపీటీసీ కుబేరుడు, నాయకులు ఏడుపాయల శ్రీనివాస్‌గౌడ్‌, మాణిక్యరెడ్డిలతో పాటు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *