*నాగ్సాన్‌పల్లిలో సీజ్ చేసిన ఇసుకకు ఈ నెల 25న బహిరంగ వేలం*

వేద న్యూస్, పాపన్నపేట నవంబర్ 19 

 

పాపన్నపేట మండల పరిధిలోని నాగ్సాన్‌పల్లి గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచి సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు పాపన్నపేట తహశీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు
గత నెల అక్టోబర్ 26న పాపన్నపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగ్సాన్‌పల్లి శివారులో అక్రమంగా తరలించిన సుమారు 39 క్యూబిక్ మీటర్ల (13 ట్రాక్టర్లు) ఇసుకను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం ఆ ఇసుకను గ్రామ పాలన అధికారి సంరక్షణలో ఉంచారు. మెదక్ మైన్స్ అండ్ జియాలజీ అధికారుల సూచనల మేరకు ఈ నెల 25వ తేదీన ఉదయం 11:00 గంటలకు నాగ్సాన్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల గిర్దావార్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట నిర్వహించనున్నారు.
వేలంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు తహసీల్దార్ పాపన్నపేట పేరు మీద రూ. 10,000/- డిమాండ్ డ్రాఫ్ట్ (డి డి) తీయాల్సి ఉంటుంది.
ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4:00 గంటల లోపు సంబంధిత డిమాండ్ డ్రాఫ్ట్‌ను తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించాలి. గడువు లోపు డీడీ సమర్పించిన వారు మాత్రమే ఈ నెల 25న జరిగే వేలం పాటలో పాల్గొనడానికి అర్హులు.
బహిరంగ వేలంలో అత్యధిక ధర పాడిన వారికి ఇసుకను కేటాయిస్తారు. విజేతలు పూర్తి వేలం మొత్తాన్ని చెల్లించిన తర్వాత ఇసుకను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. వేలం దక్కని వారికి వేలం ప్రక్రియ ముగిసిన వెంటనే వారి డిమాండ్ డ్రాఫ్ట్‌లను తిరిగి ఇచ్చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *