*సిద్దిపేట సీఎం సభకు పాపన్నపేట నుండి కదలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు*

*ఇందిరమ్మ బీమా ప్రారంభోత్సవానికి పాపన్నపేట నుండి భారీ తరలింపు*

వేద న్యూస్, పాపన్నపేట నవంబర్ 19

సిద్దిపేటలో నేడు నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు పాపన్నపేట మండలం నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివెళ్లారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
పాపన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక బస్సులలో సిద్దిపేటకు బయలుదేరారు.
ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ చారిత్రాత్మక బీమా పథకాన్ని తీసుకొస్తోందని పేర్కొన్నారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, యువజన విభాగం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *