*అర్హులైన చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలి*

*చేనేత భవన్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన పాపన్నపేట పద్మశాలి సంఘం నాయకులు*

వేద న్యూస్, పాపన్నపేట

రాష్ట్రవ్యాప్తంగా 50 సంవత్సరాలు పైబడిన అర్హులైన చేనేత కార్మికులందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ పాపన్నపేట మండల పద్మశాలి సంఘం నాయకులు సోమవారం హైదరాబాద్‌కు తరలివెళ్లారు.
రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్, పాపన్నపేట మండల చేనేత సహకార సంఘం చైర్మన్ కొడపాక విట్టల్ ఆధ్వర్యంలో నాయకులు నాంపల్లిలోని చేనేత భవన్‌కు చేరుకున్నారు. అక్కడ చేనేత కమిషనర్ దూడ వెంకట రమణ, ఏడీఈ లను కలిసి చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అర్హులైన ప్రతి కార్మికుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు వళ్ళందేశి శ్రీనివాస్, డైరెక్టర్ దాసరి యాదయ్య, పల్లె సంగమేశ్వర్, పోల శ్రీనివాస్‌లతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పద్మశాలి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *