- ప్రజలు క్యాంపును సద్వినియోగం చేసుకోండి: నిర్వాహకులు
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ అమ్మ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లో ఈ నెల 24 న (మంగళవారం) ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. సదరు క్యాంపు లో రుమటాలజిస్ట్, కీళ్ళవాతం స్పెషలిస్ట్ డాక్టర్ వి.కృష్ణకాంత్, స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సతీష్..పేషెంట్లను ఉచితంగా చూసి తగు వైద్యం అందించనున్నారు.
జమ్మికుంట పట్టణ, మండల, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సంబంధిత అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఉచిత హెల్త్ క్యాంపునకు హాజరు కావాలని అమ్మ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ బొజ్జం చాందిని సంతోష్ రెడ్డి కోరారు.
ప్రజలు తమ అనారోగ్య సమస్యల నుంచి బయట పడేందుకు వైద్య నిపుణుల వద్దకు వెళ్లడం ఉత్తమమని, అరుదైన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్న అమ్మ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నీ ఒక్కసారి సంప్రదించి.. తగు వైద్యం పొందాలన్నారు. మరిన్ని వివరాలకు 9959744380,9030444380 ఫోన్ నంబర్ లను సంప్రదించొచ్చనీ పేర్కొన్నారు.
