ఏడుపాయల వనదుర్గాభవాని సన్నిధిలో కన్నులపండువగా తులసి అమ్మ దీపాలంకరణ..

ఆకాశదీపం వెలుగులు

వేద న్యూస్, పాపన్నపేట

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మాసోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శనివారం రోజు ప్రత్యేక దీపాలంకరణ, ఆకాశదీపం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

*తులసి అమ్మ రూపంలో దీపాలంకరణ*

ఆలయ ప్రాంగణంలోని తులసికోట వద్ద తులసి చెట్టు చుట్టూ తులసి అమ్మవారి ఆకారం వచ్చేలా మట్టి ప్రమిదలతో విశేషంగా అలంకరించారు. భక్తులు, అర్చకులు కలిసి ఈ దీపాలను వెలిగించడంతో ఆ ప్రాంతమంతా దివ్య కాంతులతో వెలిగిపోయింది.

*ఆకాశదీపం సేవ:*

కార్తీకమాస విశిష్టతను చాటుతూ ఆలయ ఆవరణలో ఆకాశదీపం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆకాశదీప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

*భక్తుల సందడి*

మంజీరా నది పాయల మధ్య కొలువుదీరిన వనదుర్గాభవాని అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. కార్తీక దీపాలు వెలిగించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, పల్లె సాయిబాబా, మధుసూదన్ రెడ్డి, దీపక్ రెడ్డి, నరేష్, మహేష్, రమేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *