• వీరభద్రస్వామి వారి సేవలో ఆలయ అర్చకులు రాంబాబు, వీరభద్రయ్యల సంతోషం
  • పూజా కార్యక్రమాలు, అర్చనల్లో నిత్యం నిమగ్నమై సేవలందిస్తోన్న అర్చకులు

వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి:
కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో అర్చకులుగా పని చేస్తోన్న తాటికొండ వీరభద్రయ్య, మొగిలిపాలెం రాంబాబు స్వామి వారి సేవలో తరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అలిసిన అర్చకులు కొంత సమయం సరదాగా మనవళ్లతో గడిపారు.

అర్చకులు ఇరువురు తమ కుమారుని కుమారుడు, కూతురి కుమారుడు..చెరోవైపు కూర్చొపెట్టుకుని వారిని చూసి సంతోషపడిపోయారు. మనవళ్లు ఇద్దరినీ ముద్దాడి హాయిగా కొంత సేపు స్వామి వారి సన్నిధిలో ముచ్చటించారు. అనంతరం మళ్లీ వారి స్వామి వారి సేవలో పూజా కార్యక్రమాల్లో మునిగిపోయారు. కాగా, అర్చకులు ఇరువురి స్వామివారి సన్నిధిలో అందిస్తున్న సేవలను చూసి భక్తులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.