- ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకు బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ వినతి
వేద న్యూస్, హైదరాబాద్:
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కి బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఆచార్య కొండ లక్ష్మణ్బాపుజీ గారు మన జిల్లాలోని వాంకిడి మండలంలో జన్మించి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని ఎన్నో ఉద్యమాలు చేసిన మహనీయులు అని చెప్పారు.
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సదన కొరకు తన మంత్రి పదవిని కూడ త్యాగం చేసి నిండు చలికాలంలో 90 సం॥ల వయస్సులో కూడ ఢిలి లోని జంతర్ మంతర్ వద్ద నిరహార దీక్షచేసిన గొప్ప మహనీయులు. బాపుజీ గారు మన జిల్లాలో ఉండి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మనకు గర్వకారణం అని పేర్కొన్నారు. కావున మనము కూడ జిల్లాల్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు బాపుజీ గారి పేరుని నామకరణం చేయుటకు కృషి చేయవలసిన అవసరం ఉందని వెల్లడించారు.
ముఖ్య మంత్రి, సంబందిత శాఖమంత్రి అధికారుల దృష్టికి తీసుకువెల్లి మెడికల్ కళాశాలకు లక్ష్మణ్ బా పుజీ పేరు నామకరణం చేయించి ఈ నెల 27న కొండ లక్ష్మణ్ బాపుజీ గారి జయంతికి కొండా లక్ష్మణ్ అభిమానులకు కానుకగా ఇవ్వగలరని బి.సి యువజన సంఘంగా మనవి చేశారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నాయకులు పిప్రే సాయి నాగశే బాలాజీ,వడై బాపూజీ తదితరులు పాల్గొన్నారు.