వేద న్యూస్, డెస్క్:
తిరుపతి లడ్డు మహాప్రసాదం నాణ్యత కోల్పోయేలా చేసి తగిన శాస్తి పొందినా ఇంకా ప్రమాణాలు చేస్తామని వైసీపీ లీడర్లు అరవడం విడ్డూరంగా ఉందని జనసేన జిల్లా అధ్యక్షురాలు సోమరౌతు అనూరాధ విమర్శించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దొంగే దొంగ అన్న చందంగా వైసీపీ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలు వైసీపీని ఓడించినా ఆ పార్టీ తీరు ఇంకా మారలేదని వెల్లడించారు
చేసిన పాపాలు ప్రమాణాలు చేస్తే పోవని, ఎప్పుడు పాపాలు అప్పుడు అనుభవించాల్సిందేనని వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పనికిమాలిన వారు చేసే చాలెంజ్ కు స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు తన విలువైన సమయం వృథా చేసుకోరని స్పష్టం చేశారు.