- జనసేన పార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి అనురాధ
వేద న్యూస్, డెస్క్;
మహిళా సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని జనసేనపార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ తెలియజేశారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నాటికి మహిళలకు ఉచిత గ్యాస్ అందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు.
ఈ నెల 29వ తేదీ నుంచి ఉచిత గ్యాస్ కొరకు బుకింగ్స్ ప్రారంభమవుతాయని తెల్ల రేషన్ కార్డు కలిగిన గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి మహిళ ఉచిత గ్యాస్ కొరకు బుకింగ్స్ చేసుకోవచ్చన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన విధివిధానాలను వెలువరించిందనితెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా పనిచేస్తుందన్నారు. జనవరిలో తల్లికి వందనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని ఇప్పటికే ప్రభుత్వం తెలియజేసిందని ఆమె పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతికి ప్రత్యేక రైలు మార్గం ఏర్పాటు చేసేందుకు విధి విధానాలు ప్రకటించడం కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు.
కూటమి ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయటం జరుగుతుందని అనురాధ తెలియజేశారు, ఉచిత గ్యాస్ కు అర్హులైన మహిళలందరూ ఈనెల 29 నుంచి గ్యాస్ బుక్ చేసుకుని గ్యాస్ సిలిండర్ పొందాలనిసూచించారు.
తీసుకున్న మరుసటి రోజుకి మీ బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం మీరు చెల్లించిన నగదు జమ చేయడం జరుగుతుందని వివరించారు. ప్రతి మహిళ ఉచిత గ్యాస్ పథకం వివరాలు తెలుసుకుని సద్వినియోగపరుచుకోవాలని సోమరౌతూ అనురాధ సూచించారు.