వేదన్యూస్ – వర్ధన్నపేట
వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం నియోజకవర్గంలో ఇల్లంద గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాగరాజు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమానికి హజరు కావడానికెళ్తున్న ఎమ్మెల్యే నాగరాజును ఆ మండలంలో ఇసుక కూలీలు.. ట్రాక్టర్ల డ్రైవర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
ఆకేరు వాగు నుండి ఇసుకను తరలించకుండా స్థానిక అధికారులు.. పోలీసులు చర్యలు తీసుకోవడంతో గత ఏడాదిన్నరగా తాము ఉపాధిని కోల్పోయాము. మాకు బతుకు దేరువును చూపించాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. పూర్తిగా ఆ వాగుపై ఆధారపడి జీవిస్తున్న ఐదు వేల కుటుంబాలు నడిరోడ్డుపై పడ్డాయి.
మేము ఓట్లేసి గెలిపించుకుంటే మా బతుకులను ఆగం చేశారు అని ఆందోళనను వ్యక్తం చేశారు. పోలీసులు.. అధికారులు వాళ్లకు నచ్చచెప్పాలని ఎంత ప్రయత్నించిన వినలేదు. దీంతో చేసేది ఏమి లేక వారిపై అగ్రహాం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే అక్కడ నుండి వెళ్లిపోయారు.