వేదన్యూస్ – హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా జనసేన సీనియర్ నేత కొణిదెల నాగబాబు నిన్న బుధవారం మండలి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా టాలీవుడ్ సీనియర్ నటుడు. స్టార్ హీరో .. మెగాస్టార్ చిరంజీవి నాగబాబుకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.
తన అధికారక ట్విట్టర్ అకౌంట్ లో ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకు అభినందనలు అని ఎక్స్ లో పోస్టు చేశారు.
https://x.com/KChiruTweets/status/1907436157442342915
దీనికి బదులుగా ఎమ్మెల్సీ నాగబాబు ” థ్యాంక్స్ అన్నయ్య.. మీరు చూపిన ప్రేమకు..అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు. మీరు ఇచ్చిన పెన్ నాకు ఎంతో ప్రత్యేకం. నా ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో ఆ పెన్ ఉండటం నాకు చాలా అదృష్టం అన్నయ్య అంటూ బదులిచ్చారు.