Pat Cummins

వేదన్యూస్ – కలకత్తా

ఐపీఎల్ -2025 సీజన్ ప్రారంభ మ్యాచ్ లో అదరగొట్టిన సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టు ఆ తర్వాత వరుస మూడు మ్యాచ్ ల్లో ఘోర ఓటమి పాలైన సంగతి తెల్సిందే.లక్నో సూపర్ జెయింట్స్ పై ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పై ఏడు వికెట్ల తేడాతో ఘోర ఓటమి పాలైంది.

తాజాగా నిన్న గురువారం కోలకత్తా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఎనబై పరుగుల భారీ తేడాతో పరాజయం పొందింది. దీంతో వరుస హ్యాట్రిక్ ఓటమిలపై కెప్టెన్ పాట్ కమిన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో అదరగొట్టిన మా జట్టు ఆటగాళ్ళు ఆ తర్వాత ప్రతీ మ్యాచ్ లోనూ తేలిపోయారు.

ఆ మ్యాచ్ తర్వాత అత్యుత్తమ ప్రదర్శనకు జట్టు ఆటగాళ్లందరూ దూరంగా ఉన్నారు. బౌలింగ్ బాగున్నా కానీ బ్యాటర్లు మధ్యలోనే చేతులేత్తేస్తున్నారు. ఇక ఫీల్డింగ్ అయితే మరి ఘోరంగా ఉంది. పట్టుకునే వీలున్న క్యాచులను సైత జారవిడుస్తున్నారు. ఇకనైన మా జట్టు ఆటగాళ్ళు అన్ని రంగాల్లో ఫామ్ లోకి వస్తారని భావిస్తున్నానని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.