వేదన్యూస్ – ప్రజాభవన్
తెలంగాణ డిప్యూటీ సీఎం .. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. అక్రమ కేసులు పెట్టి సంగారెడ్డి జైలుకి తరలించిన ఇద్దరు విద్యార్థులను భేషరత్ గా విడుదల చేయాలి.
అంతేకాకుండా వారిపై పెట్టిన కేసులన్నీంటిని తక్షణమే ఉపసంహారించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన సంగతి మనకు తెల్సిందే. తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయంలో భాగంగా హెచ్ సీయూలో బందోబస్తుగా ఉన్న పోలీసులందర్నీ తక్షణమే వెనక్కి తీసుకోవాలి. అక్కడ ఎలాంటి చర్యలకు పోలీసులు పాల్పడకూడదు. యూనివర్సిటీలో భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా తగిన జాగ్రత్తలను తీస్కొవాలని వీసీకి లేఖ రాశారు.