Revanth Reddy AnumulaRevanth Reddy Anumula

వేదన్యూస్ – గాంధీభవన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి రెండు ఏండ్లు అవుతున్న కానీ అనుముల రేవంత్ రెడ్డి పేరును చాలా మంది మరిచిపోతున్నారు. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రేటీల వరకూ అందరూ ఆయా సందర్భాల్లో మాట్లాడే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించకపోవడం పలు మార్లు మనం గమనిస్తూనే ఉన్నాము.

తాజాగా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు మందుల సామేలు గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన అదేశాలతో  రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు గారి సారథ్యంలో ప్రజాపాలనలో ప్రజలకు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నాము అని అన్నారు.

దీంతో సాక్షాత్తు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి పేరు మరిచిపోవడాన్ని బట్టి చూస్తుంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎవరూ అంగీకరించడమే కాదు కనీసం పేరును కూడా గుర్తుపెట్టుకోవడం లేదని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.