వేదన్యూస్ -తొర్రూరు
తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో ఓ వింతైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పాల్గోన్నారు.
ఆగ్రామంలోని పాఠశాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యేను అదే గ్రామ పంచాయితీలో పని చేసే సాయిలు, ధర్మారపు మల్లమ్మ, ధర్మారపు వెంకటమ్మ, జయమ్మ, చింతకుంట్ల మల్లయ్య, మైబూ కలిసి ఏడాదిగా తమకు జీతాలు రావడం లేదు.
కుటుంబం గడవటమే కష్టంగా ఉంది. తమ యందు దయతలచి జీతాలను ఇప్పించాల్సిందిగా ఎమ్మెల్యేను కోరారు. అంతే తర్వాత రోజు నుండి మీరు పనికి రానవసరం లేదని సంబంధితాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిగా జీతాలు రాక. ఉన్న ఉద్యోగాలు ఊడి ఆ కుటుంబాలు నడిరోడ్డున పడ్డాయి.