వేదన్యూస్ – మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాం చంద్రూ నాయక్ ప్రభుత్వాధికారులపై నోరు పారేసుకున్నారు. జిల్లాలోని చిన్నగూడూరు, మర్రిపెడ లో జరిగిన పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గోన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పంచాయితీ కార్యదర్శి దగ్గర నుండి ఎంపీవోలు, కరెంటు, పోలీస్ డిపార్మెంట్ అధికారులతో పాటు రెవిన్యూ అధికారులు సైతం నా మాట వినడం లేదు. ఏదైన పని చేయమంటే ఇడియట్ లెక్క మాటలు చెబుతున్నారు.
మీకు ఉద్యోగాలు చేయడం ఇష్టం లేకపోతే మీ ఉద్యోగాలకు రాజీనామా చేసి వ్యాపారాలు చేసుకోండి. నా పదవి ఇప్పుడే ఆయిపోతుందని అనుకుంటున్నారు. నేను విప్ ను.. మెజిస్ట్రేట్ ను.. కలెక్టర్ ర్యాంకు నాది. ఇసుక రవాణాకు ఎందుకు అనుమతివ్వడం లేదు.
టోకెన్ సిస్టమ్ పెట్టి అనుమతిలివ్వచ్చు కదా. రిటైర్మెంట్ అయ్యే వయసులో సస్పెండ్ లు ఎందుకు అని ఎమ్మార్వోపై నోరు పారేసుకున్నారు . దీనిపై స్థానికులు.. రెవిన్యూ ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.