•  డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి..
  •  నివేదిక సైతం పంపాలని హనుమకొండ డీ ఎం.హెచ్ వో కు సూచన

వేద న్యూస్, వరంగల్:

బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై బాధితుడులింగబత్తిని కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంధన్ హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ నలిని కృష్ణపై విచారణ జరిపి.. తగు చర్యలు తీసుకోవాలని హనుమకొండ డిఎంఅండ్ హెచ్ వో ను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆదేశించారు.

టీ జీ సీ ఈ యాక్ట్(చట్టం) ప్రకారం ఫిర్యాదుదారుకు సైతం సమాచారం అందించి.. సదరు ఆసుపత్రి పై విచారణ అనంతరం తీసుకున్న చర్యలపై నివేదికను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసుకు పంపించాలని అడిషనల్ డైరెక్టర్ (ప్లానింగ్) డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పేర్కొన్నారు.