వేద న్యూస్, వరంగల్:

భీమదేవరపల్లి మండల పరిధిలోని ముల్కనూరు జెడ్పీహెచ్ బాలుర పాఠశాలలో  బుధవారం ‘‘తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ’’  కరపత్రాన్ని ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఆవిష్కరించారు.  

మండల టీపీటీఎఫ్అధ్యక్షుడు రామంచ భిక్షపతి కరిపత్రాన్ని రిలీజ్ చేశారు. ‘‘ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే విధానాలను ప్రతిఘటించాలని’’ కోరుతూ ఈ నెల( జూన్ ) 27న హైదరాబాద్‌లో ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద జరిగే ధర్నాను ఉపాధ్యాయ మితులు విజయవంతం చేయాలని కోరారు. 

కార్యక్రమంలో ZPHS (బాలురు) ముల్కనూర్ ప్రధానోపాధ్యాయుడు పోతినేని రవి ప్రకాష్, DTF బాధ్యులు దాపరి రవిందర్, TRTF జిల్లా బాధ్యులు శ్రీనివాస్ నాయక్, TPTF మండల ప్రధానా కార్యదర్శి కాలేసి కొమురయ్మయ, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.