• ఏసీబీ నెట్‌లో మెదక్ జిల్లా టేక్మల్ పోలీస్ స్టేషన్ సబ్ఇ న్‌స్పెక్టర్

వేద న్యూస్ టేక్మాల్:

 బి ఎన్ ఎన్ ఎస్,చట్టం, 2023లోని సెక్షన్ 35(3) కింద జారీ చేయబడిన నోటీసులకు సంబంధించి మరియు టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన దొంగతనం కేసులో నిందితులుగా ఉన్న ఫిర్యాదుదారు,  అతని సహచరుడిపై లోక్ అదాలత్‌లో ఓ కేసు పరిష్కారమైంది. ఆ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుదారుడి నుంచి మెదక్ జిల్లా, టేక్మాల్ పోలీస్ స్టేషన్, సబ్-ఇన్ స్పెక్టర్ పోలీస్ రాజేష్.. రూ.30,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించారు.

ఏసీబీ అధికారులను చూడగానే, పారిపోయాడు. అధికారులు అతన్ని వెంబడించి జై దుర్గాభవాని వైన్స్ ఎదురుగా ఉన్న వ్యవసాయ పొలాలలో పట్టుకున్నారు. నిందితుడిని హైదరాబాద్‌లోని గౌరవనీయులైన రెండో అదనపు ప్రత్యేక న్యాయమూర్తి, స్పెషల్ , ఏసీబీ కేసుల విచారణ కోర్టు ముందు హాజరుపరుస్తామని, కేసు దర్యాప్తులో ఉందని అధికారులు వెల్లడించారు.

భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచామని, అవినీతికి పాల్పడుతున్న వారిపై ఫిర్యాదుకు ఫోన్ నంబర్ 1064 కు కాల్ చేయాలని ఏసీబీ ఆఫీసర్లు సూచించారు.