వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఆటో బోల్తా కొట్టింది. స్థానికుల కథనం ప్రకారం..బొప్పాపూర్ గ్రామానికి చెందిన షేక్ మల్లంగ్ ఆటోలో సుమారు 9 మంది ప్రైవేటు స్కూల్‌కు వెళ్తున్నారు. గాయత్రి డిగ్రీ కాలేజ్ వద్ద డాగ్స్ అడ్డు రావడంతో ఆటో అదుపు తప్పి పల్టీలు కొట్టింది.

ఈ ప్రమాదంలో పలువురు స్టూడెంట్స్‌కు స్వల్పగాయాలు కాగా, మహమ్మద్ హర్షద్ అనే పదో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలై తుంటి వెనుక భాగంలో నరాలు చితికినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.