Vijayashanti

వేదన్యూస్ – ఫిల్మ్ నగర్

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ… తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతికి నటుడు.. హీరో పృధ్వీ పాదాభివందనం చేశారు. నందమూరి వంశానికి చెందిన హీరో కళ్యాణ్ రామ్ హీరోగా..  విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుండగా ప్రదీప్ చిలకూరి దర్శకత్వంలో  తెరకెక్కిన మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి.

ఈ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గోన్న నటి విజయశాంతికి నటుడు పృధ్వీ పాదాభివందనం చేశారు.. ఈ సందర్భంగా నటి విజయశాంతి పృధ్వీ నా చిన్న తమ్ముడు అని దీవించారు. దీనికి బదులుగా పృధ్వీ నేను అక్కకి ప్రియ తమ్ముడ్ని అని అన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి మూవీతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన పృధ్వీ దాదాపు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు. శరత్ కుమార్ , విజయశాంతి కీలక పాత్రల్లో 1999లో వచ్చిన రాజస్థాన్ మూవీలో నటించిన పృధ్వీ తాజాగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో ఆమెతో నటిస్తున్నారు.