ms dhoni

వేదన్యూస్ – కోల్ కత్తా

మహేందర్ సింగ్ ధోనీ టీమిండియాకి అన్ని ఫార్మాట్ల వరల్డ్ కప్ లను అందించిన లెజండ్రీ ఆటగాడు.. కెప్టెన్. అంతేనా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐదు సార్లు కప్ లను అందించిన గ్రేట్ కెప్టెన్. అలాంటి మహోన్నతమైన చరిత్ర ఉన్న మహేందర్ సింగ్ ధోనీకి దాదాపు తొమ్మిదేండ్ల కిందట జరిగిన అవమానాన్ని మళ్లీ చేసింది కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు.

నిన్న శుక్రవారం కేకేఆర్ సోంత గడ్డపై జరిగిన మ్యాచ్ లో చెన్నై బ్యాటర్లంతా వరుసగా ఔటై క్రీజును వదిలి పెవిలియన్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మహేందర్ సింగ్ ధోనీకి కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే ఫీల్డింగ్ సెట్టింగ్ సర్కిల్ లోపలనే అందర్ని పెట్టారు. అయితే ఫీల్డింగ్ సెట్టింగ్ ను ఎవరూ ఎక్కడ ఉండాలనేది కెప్టెన్ ఇష్టం . కానీ అక్కడుంది మహేందర్ సింగ్ ధోనీ. హిట్టర్. క్రీజు వదలకుండానే బంతిని బౌండరీ అవతల పడేయగల సత్తా ఉన్న బ్యాట్స్ మెన్.

అలాంటి సత్తా ఉన్న మహేంద్రుడు క్రీజులోకి వస్తే ఫీల్డింగ్ ను ఎలా నిలబెట్టాలి. కానీ ఓ టయిలైండర్ బ్యాట్స్ మెన్ క్రీజులోకి వస్తే ఎలా ఫీల్డింగ్ సెట్ చేస్తారో అలా చేయడం మహేంద్రుడ్ని అవమానించడమే అని ఇటు చెన్నై అభిమానులు.. అటు క్రికెట్ అభిమానులు సరిగ్గా తొమ్మిదేండ్ల కిందట అంటే 2016లో అప్పటి కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ధోనీ పట్ల వ్యవహారించిన తీరును గుర్తు చేసుకుంటూ విమర్శలు ఎక్కు పెడుతున్నారు. అజింక్యా రహానే చేసింది ఏమి బాగోలేదని సెటైర్లు వేస్తున్నారు.

Dhoni faces the same humiliation again after 9 years..!