రైతులకు శిక్షణ కార్యక్రమం

వేద న్యూస్,బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం లో ఈ రోజు జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం పైన విలసాగర్ క్లస్టర్ లోని రైతులకి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.బోయినిపల్లి మండలం లో ఈ పథకం క్రింద విలసాగర్ గ్రామంలోని 125 మంది రైతులను గుర్తించి వారికి శిక్షణ నిర్వహించారు.ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా వివిధ పంటల్లో దిగుబడులు సాధిస్తూ విషరహితమైనటువంటి రసాయన రహిత పద్ధతుల ద్వారా పంటల దిగుబడి పొందేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు, ప్రకృతి వ్యవసాయంపై పనిచేస్తున్న ఏవైఈఈ స్వచ్ఛంద సంస్థ స్థాపకుడు శ్రీకాంత్, రైతులకు శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో, రసాయన/ క్రిమిసంహారక మందులు వాడకుండా పంటలను పండించడం వల్ల పెట్టుబడి తగ్గించుకుని, నాణ్యమైన దిగుబడి సాధించి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దీని కొరకు ఒక దేశీ ఆవు ఉంటే చాలునని, జీవామృతం, భీజమృతం మొదలగునవి తయారు చేసుకొని, రసాయన ఎరువులు వాడకుండా పంటలు పండించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని ప్రణీత, ఏఈఓ రజిత పాల్గొన్నారు.