వేద న్యూస్, పార్వతీపురం:
పార్వతిపురం మండలం పెదబోండపల్లి రైతులు యాడ్రాపు అప్పలనాయుడు, సోదరపు ధనుంజయ్, యాడ్రాపు స్వామి నాయుడు వరిలో ఏ గ్రేడ్ మోడల్ ద్వారా అధిక దిగుబడి పొందుతున్నారు. వరి పొలంలో 0.10 సెంట్లు గట్టు వెడల్పు చేసుకుని.. అంతరపంటలుగా కంది, బెండ, చిక్కుడు, వంగ, మిరప, అరటి, తోటకూర, గోంగూర, సుమారు పది రకాలు పంటలు వేసుకుని అధిక ఆదాయం సంపాదిస్తున్నారు. ప్రధాన పంటకు అయిన ఖర్చు పోను ఇంటికి సంవత్సరం పాటు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తింటున్నామని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల లాభాలు నిరంతరం వస్తాయని, ఆరోగ్యం కూడా బాగుంటున్నదని చెప్పారు. ఈ పంటను రాష్ట్ర స్థాయి నుంచి ఎన్ఎఫ్ఎ టీమ్ రాజారావు, ఎన్ఎఫ్ఎ జి. అన్నపూర్ణ, మండల ఇన్‌చార్జి ఎన్. రవణమ్మ, యూనిట్ ఇంచార్జి కర్రి సౌజన్య, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు సోమవారం పరిశీలించారు.