వేద న్యూస్, పార్వతిపురం:
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చోళపదం గ్రామ సమీపంలో అంత రాష్ట్ర రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సుమారు 78 ఎకరాల అగ్రిగోల్డ్ భూములలో కొన్ని ఎకరాలు టేకు తోట ఉందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సదరు తోటలో అనేక టేకు చెట్లు రాత్రివేళ మాయమైనట్లు తెలిసిందని, 8 రోజుల క్రితం రెండు నాటు బండ్లతో టేకు చెట్లు అటుకునేరు నుంచి పార్వతీపురం వైపు అంతరాష్ట్ర రహదారిపై వెళ్తున్న నేపథ్యంలో ఆ రెండు నాటు బండ్ల టేకు కలప ను కొమరాడ తహశీల్దార్ రాత్రి వేళ పట్టుకున్నారని చెప్పారు.
అనంతరం కొమరాడ పోలీస్ స్టేషన్ కు అప్పజెప్పారని, ఇది జరిగి 8 రోజులైనా నేటికీ కలప ఎక్కడిదో తేల్చలేదన్నారు. సదరు కలప రైతు పొలంలోనిదా? లేదా? ఎక్కడిది అనేది ఎందుకు తేల్చడం లేదని ప్రశ్నించారు. గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్న అగ్రిగోల్డ్ సంస్థ కి సంబంధించిన టేకు చెట్ల లేదా ??అనే విషయాన్ని చెప్పడానికి ఇంత జాప్యం దేనికని అడిగారు. కలప విషయంలో దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ భూముల అమ్మేసి ఇక్కడున్న లబ్ధిదారులకి అన్ని విధాలుగా డబ్బులు చెల్లించి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు హెచ్ రామారావు పాల్గొన్నారు.